![]() |
ఈ ఆకు పచారీ కొట్లలో లభ్యమవుతుంది.అజీర్ణ వ్యాధి నివారణకు సునాముఖి ఆకు భేష్షుగా పనిచేస్తుంది. కడుపునొప్పి, మలబద్ధకం, అజీర్తి ఈ ఆకు చారుతో నివారించబడతాయి.
కావలసినవి :
సునాముఖి ఆకు - కొద్దిగా
చింతపండు - కొద్దిగా
నీరు - ఒకటిన్నర లీటర్లు
ఉప్పు, కారం, పసుపు - తగినంత
పచ్చిమిర్చి - 1
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - చిన్నకట్ట
జీలకర్ర, ఆవాలు - 1 స్పూన్
తయారీ విదానం :
ముందుగా నీటిలో సునాముఖి ఆకు వేసి బాగా కాగనీయాలి. సునాముఖి ఆకు రసం అంతా నీటిలోకి దిగుతుంది. దాన్ని వడకట్టి అందులో చింతపండు బాగా పిసికి పిప్పి తీసి పారేసి ఉప్పు, పసుపు వేసి కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మరగనీయాలి. బాగా మరిగినాక ఈ చారులో పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు వేస్తే సరి. ఈ చారు ఎప్పుడూ రాత్రిళ్లు పెట్టుకుంటే మలబద్ధకం, అజీర్తి దరికి రావు.