మొక్కజొన్నలు(లేతవి) - రెండు కప్పులు
పంచదార - 150గ్రా
నెయ్యి - 50గ్రా
జీడిపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
పాలు - రెండు కప్పులు
యాలకుల పొడి - అర టీ స్పూన్
కిస్మిస్లు - రెండుటేబుల్ స్పూన్లు
కోవా - 100గ్రా.
తయారుచేయు విధానం :
ముందుగా మొక్కజొన్న గింజలను మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఒక పాత్రలో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక గ్రైండ్ చేసిన మొక్కజొన్న మిశ్రమాన్ని వేయాలి. కాసేపు ఫ్రై చేసిన తరువాత అందులో పాలు పోసి మరిగించుకోవాలి. కొంచెం చిక్కబడిన తరువాత మిగిలిన నెయ్యి కూడా వేసి కొంచెం సేపు తిప్పాలి. తరువాత కోవా, పంచదార వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపుకోవాలి. చివరగా యాలకుల పొడి వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి పైన జీడిపప్పు, కిస్మిస్లతో గార్నిష్ చేసుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కోసుకోవాలి. అంతే.. మొక్కజొన్న హల్వా రెడీ.