![]() |
ఐష్ కోసం ఆరాటం !
సినిమారంగంలో ఎప్పుడూ ఒకటే జంటను తెరపై చూస్తుంటే ప్రేక్షకులకు విసుగెత్తుతుంది. సగటు ప్రేక్షకుడెపుడూ వెరైటీ కోరుకుంటాడు. సైఫ్ ఆలీఖాన్ గురించి అందరికీ తెలుసు. త్వరలో సైఫ్ నటించిన ‘ఏజెంట్ వినోద్’ సినిమా పూర్తికావస్తోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే ఇటీవల విడుదలైన ‘గుజారిష్’ కొంత నిరాశపరిచినా నటనాపరంగా ఐష్‌కు మంచి మార్కులే పడ్డాయి. మొత్తానికి ఐశ్వర్యరాయ్, సైఫ్ అలీఖాన్ ఇద్దరూ కలిసి జంటగా ఇంతవరకూ ఏ చిత్రంలోనూ నటించలేదు. వీళ్లిద్దరినీ కలిపి సినిమా తీసే అవకాశం ప్రముఖ దర్శక నిర్మాత విశాల్ భరద్వాజ్‌కు దక్కింది. విశాల్ గత కొంతకాలంగా ఐష్ డేట్స్ కోసం పడిగాపులు పడుతున్నాడు. పైగా ఐశ్వర్యకు విశాల్ భరద్వాజ్ వీరాభిమాని. కాగా విశాల్‌కు హీరో సైఫ్ అలీఖాన్ అత్యంత సన్నిహితుడు. విశాల్ దర్శకత్వం వహించిన ‘ఓంకార’ చిత్రంలో హీరో సైఫ్. దీంతో తను తీయబోయే చిత్రంలో హీరోగా ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ఖాయమైపోయింది.
ఇక ఐశ్వర్యను విశాల్ తన చిత్రంలో ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అసలే సినిమాలు పొదుపుగా చేసి తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుందామనుకుంటున్న ఐశ్వర్యకు మాత్రం అవకాశాల వెల్లువ వచ్చిపడుతోంది. ఈ చిత్రం ఆమె ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇది క్రేజీ ప్రాజెక్టే అవుతుందని విశాల్ నమ్మకంతో ఉన్నాడు.