![]() |
కావలసిన పదార్థాలు:
బేబీ కార్న్ - 3కాప్సికం తరుగు - 1 కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
టమోటా తరుగు - అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను
పసుపు - చిటికెడు
మసాలా పొడి - 1 టీ స్పూను
ధనియాలపొడి - అర టీ స్పూను
పచ్చి కొబ్బరి పేస్టు - అరకప్పు
కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 1 టేబుల్ స్పూను
తాలింపు కోసం (మినప్పప్పు+ఆవాలు+జీలకర్ర) - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం:
బేబీ కార్న్లని చక్రాల్లా తరిగి కుక్కర్లో కొద్ది నీరుపోసి ఉడికించి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి తాలింపు వేగాక ఉల్లిపాయ తరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేగించాలి. కాప్సికం, టమోటా ముక్కలు, ధనియాలపొడి, ఉప్పు, మసాలపొడి వేసి అరకప్పు నీటిని జతచేయాలి. కాప్సికం ముక్కలు మెత్తబడ్డాక ఉడికిన బేబీకార్న్ కూడా వేసి 3 నిమిషాల తర్వాత కొబ్బరి పేస్టు కలపాలి.తాలింపు పెట్టి రెండు నిమిషాలాగి కొత్తిమీర చల్లి దించేయాలి. ఇది కూడా పరాటాల్లోకి చాలా రుచిగా ఉంటుంది.