![]() |
ప్రేమికుల్ని మార్చుకున్నంత సులభం కాదు టాటూలను మార్చడమంటే. అదే మాటను బాలీవుడ్ భామ దీపికా పడుకునేతో అనండి. ఆ మాటను కాస్త సవరించి... 'టాటూ గుచ్చుకునేది చర్మానికే కానీ, హృదయానికి కాదు కదా!' అనేస్తుంది. అందుకేనేమో ఇదివరకు తన తెల్లటి మెడ వెనుక వేయించుకున్న టాటూను కష్టపడి తుడిపేసుకుంది. జడ కాస్త అటు ఇటు కదిలినప్పుడల్లా 'ఆర్.కె' అనే టాటూ దీపికా మెడ మీద మెరిసేది. అప్పట్లో అందరూ ఆ టాటూ గురించే చెవులు కొరుక్కునేవారు.
ఎందుకంటే 'ఆర్కె' అంటే రణబీర్‌కపూర్ అట! అతని ప్రేమలో పడ్డాక ఈ టాటూను రాయించుకుంది దీపికా. ఇప్పుడు రణబీర్‌కపూర్ క్రేజ్ తగ్గడంతో టాటూ మీద కూడా మోజు తగ్గిపోయింది ఈ బాలీవుడ్ భామకు. అందుకే, లేజర్ సర్జరీ చేయించుకుని మరీ 'ఆర్.కె' టాటూను తుడిపేసుకుంది. దాని స్థానంలో కొత్తగా 'టిఎంకె' పొడిపించుకుంది. టిఎంకె అంటే కొత్తగా వచ్చిన 'తీస్ మార్ ఖాన్' సినిమాకు షార్ట్‌కట్ అని చాలామంది అనుకుంటున్నారు.
ఇంతకీ దీపికా ఆ సినిమా పేరుని ఎందుకు టాటూగా వేయించుకుందని బాలీవుడ్ గుసగుసలాడుతోంది. బోయ్‌ఫ్రెండ్, సినిమా తర్వాత ఇంక దేని మీద దీపిక మోజు పడుతుందో చూడాలి.
![]() |
ఇంతకీ దీపికా ఆ సినిమా పేరుని ఎందుకు టాటూగా వేయించుకుందని బాలీవుడ్ గుసగుసలాడుతోంది. బోయ్‌ఫ్రెండ్, సినిమా తర్వాత ఇంక దేని మీద దీపిక మోజు పడుతుందో చూడాలి.