![]() |
కావలసిన పదార్థాలు:
బేబీ కార్న్ ముక్కలు - 2 కప్పులుటమోటా తరుగు - అరకప్పు
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
(నిలువుగా తరిగిన) పచ్చిమిర్చి - 3
లవంగాలు - 3
దాల్చినచెక్క - అంగుళం ముక్క
పసుపు - చిటికెడు
కారం - అర టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూను
తయారుచేసే విధానం:
కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేగించాలి. తర్వాత లవంగాలు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, టమోటా ముక్కల్ని వేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత బేబీ కార్న్ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి కలిపి మరో 4 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర చల్లాలి. ఈ కూర చపాతి/పరాటాల్లోకి బాగుంటుంది.