![]() |
కావలసిన పదార్థాలు :
మైదాపిండి-100గ్రా, వెన్న-100గ్రా, పంచదార పొడి-100గ్రా, కోడిగుడ్లు-రెండు లేదా మూడు, బేకింగ్ పౌడర్-ఒక టీ స్పూన్, వంట సోడా-అర టీ స్పూన్, పాలపొడి-రెండు టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్-ఒక టీ స్పూన్, కోకో పౌడర్-రెండు టేబుల్ స్పూన్లు.ఐసింగ్ కోసం :
కోకో పౌడర్-50గ్రా, వెన్న-ఒక టేబుల్‌స్పూన్, ఐసింగ్ షుగర్-100గ్రా, వెనీలా ఎసెన్స్-అర టీ స్పూన్, వేడినీరు-తగినంత.
తయారుచేసే విధానం :
మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పాలపొడి, కోకో పౌడర్, వెన్న, పంచదార మిక్సీలో వేసి బాగా గిలకొట్టాలి. దీనికి కోడిగుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. ఒకవేళ పిండి మిశ్రమం పలచగా ఉంటే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ గిలకొడుతూ పోవాలి. తరువాత ఎలక్ట్రిక్ ఓవెన్లోని గిన్నెలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40-50 నిమిషాలు బేక్ చేయాలి. బేకింగ్ పూర్తయి కేక్ చల్లారాక పైన ఐసింగ్ చేయాలి.
ఐసింగ్ ఇలా :
కోకో పౌడర్, ఐసింగ్ షుగర్, వెన్న, వెనీలా ఎసెన్స్ అన్నీ మిక్సీలో వేసి నురుగు వచ్చేంత వరకు గిలకొట్టాలి. కొద్దికొద్దిగా వేడినీరు చేర్చుతూ ఈ మిశ్రమం కాస్త గట్టిపడేలా చూడాలి. ఈ చాకొలేట్ సాస్‌ను కేక్‌పైన పోసి బటర్ నైఫ్ సహాయంతో కేక్ అంతటా సమంగా సర్దాలి. ఆపైన చాకొలెట్ కేక్‌ను అరగంట ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.