బుల్లి ఎంపీ 3 బ్యాండేజి ప్లేయర్


టేపు రికార్డుల్లో, సీడీ ప్లేయర్స్‌లో పాటలు వినే కాలం ఎప్పుడో పోయింది. ఎవరిని చూసినా చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకునే కనిపిస్తున్నారు. ఎంపీ 3 ప్లేయర్ పాటలు అందరికీ అలవాటైపోయాయి. అయితే ఇప్పుడు ఇవి కూడా బరువైపోయాయనుకున్నారు చి వీ వాంగ్, షౌయిస్ ఫు అనే ఇద్దరు చైనా ఇంజనీర్లు. అందుకే చేతిలో పట్టుకునే పనిలేకుండా, చెవిలో పెట్టుకునే అవసరం లేకుండా ఏకంగా ఒంటికి అతికించుకునే ఎంపీ 3 ప్లేయర్‌ని కనిపెట్టారు. గాయాల మీద అంటించే బ్యాండేజీలా దీన్ని శరీరానికి ఎక్కడైనా అంటించుకోవచ్చు.

మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు. బ్యాటరీలు అక్కర్లేదు. ఇక ఛార్జింగ్ గొడవే లేదు. మన శరీర ఉష్ణోగ్రతని గ్రహించి ఈ చిన్ని ప్లేయర్ పనిచేస్తుంది. దీనికుండే బుల్లి స్పీకర్లు మనకి వినిపించేంత సౌండ్‌ని మాత్రమే ఇస్తాయి. ప్రస్తుతం తక్కువ పాటల్ని వినిపించే కెపాసిటీ ఉన్న ఈ ఎంపీ3 ప్లేయర్‌ని మరింత అడ్వాన్సుగా తయారుచేస్తామంటున్నారు చి వీ వాంగ్, షౌయిస్ ఫు. ఈ బుల్లి ఎంపీ 3 ప్లేయర్ మార్కెట్లోకి వస్తే భవిష్యత్‌లో మీకు అందరి ఒంటి మీదా బ్యాండేజీలు కనిపిస్తాయన్నమాట.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top