కంప్యూటర్ ఉద్యోగులకు - 4 నిమిషాల వ్యాయామం


రోజూ వ్యాయామం చేయాలనే అనుకుంటున్నా కానీ టైమ్ దొరకట్లేదు... అనుకునే కంప్యూటర్ ఉద్యోగులకు నాలుగు నిమిషాల్లో పూర్తిచేయగలిగే చిన్న చిన్న వ్యాయామాలు సూచిస్తున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. వీటిని మీ డెస్క్ ముందే ఆఫీసులోనే చేయవచ్చు కూడా. అలాగని ఈ వ్యాయామాలను తీసిపడేయలేం. ఆఫీసులో ఉన్నప్పుడు గంటకోసారి వీటిని చేస్తే మెడనొప్పి, నడుంనొప్పి, కండరాలు పట్టేయడం లాంటి సమస్యలకు ఇవి దివ్యౌషధాలు. అవేంటో చూద్దాం మరి.

  1.  రెండు చేతులను ముందుకు చాచి రెండు అరచేతులను కలిపి వుంచండి. అలా 10 నుంచి 20 సెకన్ల పాటు ఉండండి. చేతులు రెండూ స్ట్రెయిట్‌గా ఉండేలా చూడండి.
  2. ఇప్పుడు లేచి నిలబడి రెండు చేతులను అదేవిధంగా పైకి తీసుకురండి. మీ తల భాగం నుంచి నిటారుగా పైకి ఎత్తి పట్టుకోండి. ఇలా 10 నుంచి 15 సెకన్ల పాటు ఉండండి.
  3. ఇప్పుడు రెండు చేతులను మడిచి అంటే ఒకదాని అరచేతిని మరోదాని మోచేతిపై ఉంచండి. అలా పైకే ఉంచండి. ఇప్పుడు మెడ, భుజం భాగాలను కుడివైపు కొద్దిగా వంచి, 8 నుంచి 10 సెకన్ల పాటు ఉండండి. తిరిగి ఎడమవైపు కూడా ఇలాగే చేయండి.
  4. చేతులు కిందకి దించేసి భుజాలను పైకీ, కిందకీ ఎగరేయండి. ఇలా 3 నుంచి 5 సెకన్లు చేయండి. * కిందికి ఉన్న చేతులను వెనకాల ఒకదాన్ని ఒకటి పట్టుకోండి. మెడ, భుజాలను కుడి వైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి వంచి, ఒక్కోవైపు 10 నుంచి 12 సెకన్లు కేటాయించండి.
  5. దండం పెడుతున్నట్టుగా రెండు అరచేతులను కలిపి ఉంచండి. ఇలా 10 సెకన్లు ఉన్న తరువాత పైకి కలిపివున్న అరచేతులను కిందివైపు దించండి. ఇలా మరో 10 సెకన్లు ఉండండి.
  6. కుర్చీలో కూర్చుని ఒక చేయి నడుము మీదుగా కిందకి వేలాడదీసి, మరో చేతిని పైకి నిలబెట్టి పట్టుకోండి. రెండు చేతులనూ ఇలా చేయండి. ప్రతిసారీ 8 నుంచి 10 సెకన్ల పాటు ఉండండి.
  7. కూర్చునే ఉండి నడుం భాగాన్ని మాత్రం పైకి లేపి, తలను ఎత్తి ఉంచండి. దీనికి 10 నుంచి 15 సెకన్లు కేటాయించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top