తెలుగు వారికో'నెట్‌వర్క్' - తెలుగు కింగ్‌డమ్


ఫేస్‌బుక్, ఆర్కుట్ వెబ్‌సైట్‌లు సోషల్ నెట్‌వర్కింగ్‌కు పర్యాయపదాలు గా మారిపోయాయి. ఈ వెబ్‌సైట్లకు అంతటి ఆదరణ ఉంది మరి. ఇప్పుడు కొత్తగా తెలుగు వారికోసం తెలుగులో ఇలాంటి వెబ్‌సైటే అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న తెలుగువాడు జ్యోతి కిరణ్ తెలుగు కింగ్‌డమ్( www.telugukingdom.net) పేరుతో ఒక వెబ్‌సైట్‌ని రూపొందించాడు. దేశవిదేశాల్లో ఉండే తెలుగువారి గురించి ఈ సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఎలా అంటే.. మీరో చిన్న పల్లెటూరి నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నారనుకుందాం. మీ ఊరి నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారి గురించి తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి. అప్పటికే అందులో రిజిస్టర్ అయిఉన్న వారి గురించి వివరాలు తెలుస్తాయి. ఇలా ప్రపంచం మొత్తం మీద సుమారు 294 దేశాలు, 4924 రాష్ట్రాలు, 13, 4594 పట్టణాలల్లో ఎక్కడ తెలుగువారు ఉన్నా వారి గురించి తెలుసుకోవచ్చు.

ఈ సైట్‌లో ఉండే 'వరల్డ్ వైడ్ ప్రెసెన్సు'ని క్లిక్ చేస్తే ఏ దేశంలో ఎంత మంది తెలుగువారున్నారనేది అందమైన గ్రాఫ్‌లో కనిపిస్తుంది. 'మై ప్లేసెస్' ద్వారా మీకు ఇష్టమైన ప్రాంతంలోని వారితో సంప్రదింపులు జరపొచ్చు. ఒక్క క్లిక్‌తో మీ ప్రాంతవాసులందరినీ చూడొచ్చు. మీరు కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడి వారిని వెబ్‌సైట్ ద్వారా సలహాలు, వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవేకాకుండా కాలక్షేపం కోసం ఫోరమ్స్ కూడా ఈ సైట్‌లో ఉన్నాయి. ఆర్కుట్, ఫేసుబుక్, ట్విట్టర్‌లో ఉండే అన్ని ఆప్షన్లూ ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top