36 కోట్ల ఐఫోన్....... చూసారా?


సెల్‌ఫోన్ మాదిరిగానే ఐఫోన్ కూడా ఇప్పుడు అందరి చేతుల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. మధ్యతరగతి వారికి దగ్గరవడానికి ఐఫోన్ ఇప్పుడు బోలెడు వెరైటీల్లో బయటికి వచ్చింది. దాంతోపాటే తన ప్రత్యేకతను చాటుకోవడానికి అత్యంత ఖరీదైన ఒక మోడల్‌ను విడుదల చేసింది. దాని ఖరీదు 36 కోట్ల 14 లక్షల రూపాయలు. స్టార్ట్ హగ్స్ కంపెనీవారు తయారుచేసిన ఈ ఫోన్ పేరు 'ఐఫోన్ 4 డైమెండ్‌రోజ్ ఎడిషన్'.

ఫోన్ వెనక భాగాన్ని అచ్చంగా రోజ్‌గోల్డ్‌తో చేశారు. ఫోన్ చుట్టూ ఉన్న బ్యాండ్‌ను (వంద క్యారెట్ల) 500 వజ్రాలతో అలంకరించారు. ఫోన్ ముందుభాగంలో ఉన్న యాపిల్‌లోగోలో 53 వజ్రాలను పొదిగారు. ప్లాటినమ్‌తో చేసిన ఫోన్ హోమ్‌బటన్‌కు 7.4 క్యారెట్ల వజ్రాన్ని పెట్టారు. ఇప్పటివరకూ తయారుచేసిన ఐఫోన్స్‌లో ఇదే అత్యంత ఖరీదైన ఐఫోన్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top