నెట్‌లో ఇక' సెర్చ్‌ ఇంజన్ల' బదులు 'ఆన్సర్‌ ఇంజన్‌'లు

సెర్చ్‌ ఇంజన్ల కాలం చెల్లిపోయింది. ఇపుడు ఆన్సర్‌ ఇంజన్లు వాటి స్థానంలో వస్తున్నాయి. ఇందుకోసం 'ట్రూనాలెడ్జ్‌.కామ్‌' సైట్‌ను విలియమ్‌ టున్‌స్టాల్‌-పెడోలు రూపొందించారు. వీరు కేంబ్రిడ్జ్‌లో ఉంటారు. ఇది ఇంటర్‌నెట్‌లో ఫోన్‌ లాటిదని వారు చెప్పారు. కొన్ని కోట్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుందన్నారు. దీన్ని క్లిక్‌ చేసినపుడు సంబంధిత సమాచారం ఉన్నపేజీలకు లింక్‌ ఇవ్వదని ప్రశ్నకు సమాధానం నేరుగా ఇస్తుందని వారు డైలీమెయిల్‌ పత్రికకు తెలిపారు. ఉదాహరణకు బాబ్‌ డైలాన్‌ పుట్టినరోజు గురించి ప్రశ్నిస్తే కరెక్ట్‌గా ఆ రోజు చెపుతుందన్నారు. ఒక వేళ సమాధానం లభించకపోతే తనకు తెలియదని జవాబిస్తుందన్నారు. తాము రోజురోజుకు సమాచారాన్ని అప్‌డేట్‌ చేస్తున్నామని కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతోందని అందుకు సెమాంటిక్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు. యూజర్‌ ప్రశ్నను అర్ధం చేసుకుని సమాధానం ఇవ్వటం దీని ప్రత్యేకత అని చెప్పారు. వాస్తవాలపైన, శబ్ద నిఘంటువు పైన,చివరకు ఇంగిత జ్ఞానంపైన ఆధారపడి ఈ జవాబులను ఇస్తుందన్నారు. ఇప్పటికి కొన్ని కోట్ల ప్రశ్నలకు ఈసైట్‌ ద్వారా సమాధానాలు ఇచ్చామన్నారు. విజ్ఞానం పెరిగే కొలదీ ఇంకా ఎక్కువగా ఎలా సమాధానాలు ఇవ్వాలో తాము అర్ధం చేసుకుంటామన్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top