ఇడ్లీ మెత్తగా,మృదువుగా రావాలంటే.....

ఇడ్లీ మెత్తగా,మృదువుగా రావాలంటే.....ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో రెండు చుక్కల ఆముదం వేయాలి. 

పచ్చికొబ్బరి చిప్ప వారం రోజులు నిల్వ ఉండాలంటే....చిప్ప లోపల నిమ్మరసం రాయాలి. 

CLICKHERE : మొటిమల నివారణకు పాటించవలసిన కొన్ని పద్దతులు 

 దుంపకూరలు ఉడికేటప్పుడు ఆ గిన్నె మీద తప్పనిసరిగా మూత పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే అడుగంటే అవకాశముంది.

చపాతీలు మెత్తగా మృదువుగా రావాలంటే 
అరకేజీ చపాతీపిండికి కప్పు పెరుగు, ఒక మెత్తని అరటిపండు కలపాలి. 

పగిలిన గ్రుడ్డును కొంచెం వెనిగర్‌ కలిపిన నీటిలో ఉడకబెడితే లోపలి ద్రవం బయటికి రాదు. బాగా ఉడుకుతుంది. గ్రుడ్డును ఎప్పుడూ తడిపాత్రలోనే పగుల గొట్టాలి. విధంగా చేస్తే పసుపు భాగం పాత్రకు అంటకోదు.


CLICKHERE : బ్లాక్ హెడ్స్ ను సులభంగా తగ్గించుకోవటానికి చిట్కాలు 

 పప్పులు, గోధుమపిండి, శనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాల్లో పోసి వెల్లుల్లి రెబ్బను అందులో వేసి మూతపెట్టాలి.

ఆకుకూరల్ని ఒకటి రెండు రోజులకు మించి నిలువ ఉంచితే అవి వాడిపోతాయి. కనుక కొన్న వెంటనే కూరల్ని నీళ్లలో శుభ్రంగా కడిగి అరగంటసేపు ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టాలి. తరువాత పేపరుపై ఆరబెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే తాజాగా ఉంటాయి.

CLICKHERE : గోపీచంద్ భార్య రేష్మ గురించి తెలియని విషయాలు

వండిన కూరలను ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఆ విధంగా చేయటం వలన అవి పాడయిపోతాయి. 

 తేనె, వెల్లుల్లి, కర్జూరాలను ఫ్రిజ్‌లో ఉంచరాదు.

CLICKHERE : నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top