ప్లానింగ్‌తో ఒత్తిడి నుంచి బయటపడవచ్చు

అబ్బా.. ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాను... ఎవరి నోట విన్నా ఈ మాట రాకుండా ఉండదు. ఇలా ఎప్పుడు చూసినా బిజీ బిజీ.. పని ఒత్తిడితో సతమతం అవుతున్నామని బాధపడేవాళ్లకు ఒత్తిడి నుంచి బయటపడటానికి కొన్ని  సూచనలు...

  •  ప్రతిరోజు చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక తయారుచేసుకోవాలి. ఏ పనికి ఎంత సమయం కేటాయించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరుసటి రోజు చేయాల్సిన పనులను కూడా రాసుకోవాలి. అందులో ముఖ్యమైన పనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజు పని ముగిసిన తరువాత ఒకసారి చెక్ చేసుకోవాలి. అవసరానికి తగినట్టుగా మార్పులు చేసుకోవాలి.
  •   గత అనుభవాలను ఒకసారి పరిశీలించాలి. గతంలో ఎదురయిన ఇబ్బందులను ఒకసారి గుర్తుకుతెచ్చుకుంటే అదే పరిస్థితి మళ్లీ ఎదురయితే సులభంగా అధిగమించవచ్చు.
  •   కొందరు ఒత్తిడిలో కూడా బాగా పనిచేయగలుగుతారు. మరికొందరు కొంచెం ఒత్తిడి ఉన్నా పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అటువంటి వారు సెల్ఫ్ మోటివేషన్ అలవాటు చేసుకోవాలి.
  • ఒత్తిడిని తగ్గించడానికి మసాజ్, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి. మసాజ్ వల్ల నిద్ర బాగా పడుతుంది. తద్వారా రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.
  •   వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉంటే పనిలో ఆటంకం ఉండదు.
  •   సామాజిక సేవ చేయడం అలవర్చుకోవాలి. వారంలో ఒకరోజు ఏదైనా స్వచ్ఛంద సంస్థలో సేవ అందించాలి. దీనివల్ల ఒత్తిడి నుంచి బయటపడతారు.

  • రోజూ తగినంత నీరు తాగాలి. నీరు తక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది ఒత్తిడికి కారణమవుతుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top