అమ్మాయిల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్

అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఎన్నో సౌకర్యాలు వచ్చాయి. లేడీస్ స్పెషల్ అనే మాట ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఖాతాలో ఒక వెబ్‌సైట్ కూడా చేరింది. ఆడవాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం వెబ్‌సైట్ వెలిసింది. 'నౌకరీ ఫర్ విమెన్' పేరుతో ఉన్న ఈ వెబ్‌సైట్ గురించి కొత్తలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.


ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెంచాలనే ఏకైక లక్ష్యంతో మొదలైన ఈ వెబ్‌సైట్ రానురాను పాపులర్ అయ్యింది. కేవలం అమ్మాయిలకే ఉద్యోగాలు అని చెప్పినా...వెబ్‌సైట్ చూసేవారి సంఖ్య బాగానే పెరిగింది. ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. పార్ట్‌టైం చేసుకోవాలనుకునేవారికి, ఇంట్లో ఉండే ఉద్యోగాలు చేయాలనుకునేవారికి కూడా ఈ వెబ్‌సైట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top