కోకకోలా ఫార్ములా మీకు తెలుసా ?అయితే ఇది చూడండి.


కోకకోలా మజాయే వేరు. బుసబుస పొంగుతూ- తిమ్మిర్లు పుట్టిస్తూ - ఏ విధంగా దేనిలో కలిపినా- ఆ రుచి తాలూకు చిక్కదనం.. అలాంటి కోకకోలాకు దాని ఫార్ములాయే ప్రాణం. అది మాత్రం ఏ కొద్ది మందికో తప్ప ఎవరికీ తెలియదు. ఆ ఫార్ములాకు కోకకోలా ఎంత ప్రాధాన్యం ఇస్తుందంటే, అవసరమైతే దేశంలో వ్యాపారమైనా మానేస్తుంది కానీ, ఫార్ములా వెల్లడించదు. అలాంటి కోకకోలా ఫార్ములా ‘లీక’యింది. ఇన్నాళ్లూ ‘కోకకోలా’ రుచికి ఏమేం వాడతారన్నది అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఏం కలిపి ఆ రుచిని తీసుకువస్తారోనన్న ఆలోచనల్లో మిగతా ‘కూల్‌డ్రింక్’ యాజమాన్యాలూ పోటీ పడిన మాట వాస్తవం. అట్లాంటా సిటీలోని కంపెనీలో ఒక స్టీల్ కవర్‌లో దీని ‘రెసిపి’ని భద్రపరిచి 24 గంటలూ కట్టుదిట్టమైన కాపలా ఉంచారన్న విషయమూ తెలిసిందే. ఐతే - ఒక వెబ్‌సైట్ ఆ రహస్యాన్ని ఛేదించింది. 1886లో జాన్ పెంబెర్టన్ అనే ఫార్మసిస్ట్ దీని రూపకర్త. ‘కోకకోలా’లో మెర్చన్‌డైజ్ 7ఎక్స్’ అనే ఫార్ములా వల్ల ఆ రుచి వస్తుందన్న నిజం లోకానికి తెలిసింది. కానీ - ఇది ఈనాటి మాట కాదు. 1979, ఫిబ్రవరి 8న అట్లాంటా జర్నల్ కాన్‌స్టిట్యూషన్‌లో ఒక వార్త ప్రచురితమయింది. పెంబెర్టన్ ఒకరోజు ‘కోకకోలా రెసిపి’ తాలూకు బుక్‌ని ఓపెన్ చేసి చదువుతూండగా ఆఖరన కనిపించిన ‘మెర్చన్‌డైజ్’ ఫార్ములా వల్ల దీనికి ఆ రుచి వచ్చిందనుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకి ఒక వెబ్‌సైట్ ‘కోకకోలా’ సువాసన రహస్యాన్ని ‘ఫర్ములా’తో పాటు వెలువరించింది. ఆ వెబ్‌సైట్ తెలిపిన దాని ప్రకారం
కోకకోలా తయారుచేసే విధానం
కోక ఫ్లూయడ్ - 3 డ్రామ్స్ యుఎస్‌పి
సిట్రిక్ యాసిడ్ - 3 ఓజెడ్
కెఫైన్ - 1 ఓజెడ్
చక్కెర - 30 (ఎన్ని పాళ్లు వేయాలో అస్పష్టంగా ఉంది)
నీరు - 2.5 గ్లాసులు
నిమ్మరసం - ఒక క్వార్టర్‌కి 2 పింట్స్
వెనిల్లా - 1 ఓజెడ్
కారమెల్ - 1.5 ఓజెడ్ (రంగుకి సంబంధించి అంతకంటె ఎక్కువ)
7ఎక్స్ ఫ్లేవర్ (2 ఓజెడ్‌ల ఫ్లేవర్‌కి 5 గ్లాసుల సిరప్)
ఆల్కహాల్ - 8 ఓజెడ్
ఆరెంజ్ ఆయిల్ - 20 చుక్కలు
నిమ్మ ఆయిల్ - 30 చుక్కలు
నట్‌మెగ్ (జాపత్రి ఆయిల్) - 10 చుక్కలు
కొరియాండర్ (ధనియాల ఆయల్) - 5 చుక్కలు
నెరోలి - 10 చుక్కలు
సినామిన్ ఆయిల్ (దాల్చిన చెక్క) - 10 చుక్కలు
 
ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఇప్పుడు ఎందరో దీన్ని పట్టుకుని అటూ, ఇటూ చేసి, ప్రయోగాలు ప్రారంభించడం మాత్రం ఖాయం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top