మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎయిర్ ఇండియా ఆఫర్


మార్చి 8 ఆఫర్...

పండుగలొచ్చినపుడు షాపులకు వెళితే బోలెడు ఆఫర్లు వినబడతాయి. అలాగే వచ్చే నెల ఎనిమిదవ తేదీన జరుపుకోబోయే మహిళా దినోత్సవం సందర్భంగా కూడా కొన్ని ఆఫర్లు పెట్టారు. ఆఫర్లు అనగానే బట్టల షాపులు, బంగారం షాపులు గుర్తొస్తాయి. కాని ఇప్పుడు మీరు వినబోయే ఆఫర్ కాస్త కొత్తరకం ఆఫర్. అందరూ ఇష్టపడే విమానయానం. ఆఫర్ చేస్తున్నది ఏ విదేశీ కంపెనీయో కాదు, మన ఎయిర్ ఇండియానే. మార్చి ఎనిమిదవ తేదీన ప్రయాణించే మహిళలకు 99 రూపాయలకే ఎకానమి టెకెట్ ఇస్తోంది. అలాగే ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్‌ని 1,190 రూపాయలకు ఇస్తోంది. ఇది ఇండియాలో విమానయానానికే విదేశీయానానికి కాదు. విమానమెక్కి ఓ రౌండ్ కొట్టాలని ఉంటే..వెంటనే టిక్కెట్ బుక్ చేసుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top