మార్కెట్లో రకరకాల నూనెలు ఉంటాయి. వాటిలో ఏది వాడాలన్న దానిపై మనకు ఎప్పటికీ డైలమానే. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ నూనె ఎంతవరకు వాడవచ్చో నిపుణులు అందిస్తున్న సూచనలు.. - గది ఉష్ణోగ్రత వద్ద గడ్డకడుతున్నదంటే అది ఆరోగ్యకరమైనది కాదని అర్థం. అందుకే వనస్పతి, పామాయిల్‌లను వాడకూడదు.
- కొబ్బరినూనెను కేరళలో విరివిగా వాడతారు. దీనిలో కూడా సాచురేటెడ్ ఫాట్ ఉంటుంది. కానీ కొబ్బరినూనె మంచి కొలెస్ట్రాల్ మోతాదును పెంచుతుంది. కానీ సాధారణంగా కేరళ తప్ప ఎక్కడా దీన్ని అంతగా వాడటం లేదు.
- సాచురేటెడ్ ఫాట్ బదులు అన్సాచురేటెడ్ ఫాట్ తీసుకోవడం వల్ల గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
- ఆలివ్ నూనె, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్, సాఫ్లవర్, ఆవాలు, పత్తి, వేరుశనగ నూనెలు వంటలో వాడటానికి అనుకూలమైనవి. ఒమేగా 3, ఆల్ఫా లీనోలిక్ ఆమ్లం (ఎఎల్ఎ) ఎక్కువగా ఉన్న నూనెలు మరింత ఆరోగ్యకరమైనవి.
- సోయాబీన్, ఆవాల నూనెల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్, మస్టర్డ్ నూనెలు అన్నింటికన్నా ఆరోగ్యకరమైనవి. ఎక్కువ వేపుడు చేసినా వీటివల్ల అంతగా హాని జరగదు. కానీ మనం సాధారణంగా ఎఎల్ఎ విలువ చాలా తక్కువగా ఉండే సన్‌ఫ్లవర్ ఆయిల్‌నే ఎక్కువగా వాడుతున్నాం.
- వీటి తరువాత వేరుశనగ, మొక్కజొన్న, ఆలివ్ నూనెలు మంచివి. నెయ్యి చాలా తక్కువ మోతాదులో వాడాలి.
- అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నూనెలను విడిగా కన్నా అన్నింటినీ కలిపి వాడితే మరింత మేలు చేస్తాయి.
- ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం క్షేమం కాదు. అందుకే బండిపై అమ్మే బజ్జీలు, పకోడీలను తినకపోవడమే మంచిది. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసుకుని తినడం మేలు.