అల్లు అర్జున్ వివాహం ఘనంగా జరిగిపోవటంతో ఇప్పుడు అందరి దృష్టీ చిరంజివి కుమారుడు యంగ్ హీరో రామ్ చరణ్ పై పడింది.అతనికీ ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందని అంతటా వినపడుతోంది.అపోలో హాస్పటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనుమరాలైన ఉపాసనా కామినేనిని తో మ్యారేజ్ జరగనుందని చెప్తున్నారు.ఆమె ప్రస్తుతం అపోలో హాస్పటల్స్ వైస్ ప్రెస్ డెంట్ గా కొనసాగుతున్నారు.ఇక వీరి వివాహానికి సంభందించి మాటలు ఇప్పటికే జరిగాయని ఈ మేరకు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొంతకాలంగా వినపడుతోంది.ఇక చిరంజీవి ఈ విషయం ఎనౌన్స్ చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని అంతర్గత వర్గాల సమాచారం.ప్రస్తుతం రామ్ చరణ్..సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానకి కమిటయ్యారు.ఆరెంజ్ డిజాస్టర్ అనంతరం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.చిరంజీవి కూడా బడ్జెడ్,మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తన కుమారుడు కెరీర్ ని తీర్చిదిద్దాలని ప్రతీ కథ వినటం,ప్లాన్ చేయటం చేస్తున్నారు.త్వరలోనే కొత్త చిత్రానికి సంభందించి ఎనౌ న్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.అలాగే వివాహానికి సంభందించి కూడా చిరంజీవి అతి త్వరలోనే ప్రకటన చేయవచ్చు.
ఆమెతో రామ్ చరణ్ వివాహం ఈ సంవత్సరమేనా?
teluguLifestyle Editor
11:10:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.