ఈ మాత్రలు వేసుకుంటే స్లిమ్ అయిపోతారు..'' లాంటి ప్రకటనలు ఎంత ప్రమాదకరమో చూడండి.


"బరువు తగ్గాలనుకుంటున్నారా..? మూడ్రోజులు చాలు. ఈ మాత్రలు వేసుకుంటే స్లిమ్ అయిపోతారు..'' లాంటి ప్రకటనలు ఎంత ప్రమాదకరమో ఈ వార్తను చదివితే తెలుస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ మధ్య 'ద లాటిన్ సీడ్' అనే విత్తనాలను చక్కగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఇతర దేశస్తులు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా తెప్పించుకుంటున్నారు.

ఈ విత్తనాలను తింటే బరువు తగ్గిపోతారని సంబంధిత కంపెనీ ప్రకటనలు గుప్పిస్తోంది. 'ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఈ విత్తనాలను తింటే, శరీరానికి ఎలాంటి హానీ కలగదు. బరువు బాగా తగ్గిపోతారు' అని ఆ సంస్థ హామీ ఇస్తోంది. అయితే, ఈ విత్తనాలను తింటే బరువు సంగతి దేవుడెరుగు, ఏకంగా పైకే పోతారని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. విత్తనాల్లో విషపూరిత లక్షణాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు వాళ్లు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం వీటి అమ్మకాలను నిలిపివేసింది.

దాంతో 'కొంత కాలం పాటు విక్రయాలను నిలిపివేస్తున్నాం. ఇదివరకే మా విత్తనాల ప్యాక్‌లు కొన్న వారు.. వాటిని వెనక్కి ఇచ్చేస్తే.. సొమ్ము తిరిగి చెల్లిస్తాం' అని ఆ సంస్థ తమ సొంత వెబ్‌సైట్లో ప్రకటించింది. విదేశాల్లోనే కాదు. అక్కడున్న ఎన్ఆర్ఐలు సైతం మన దేశానికి వస్తూ వస్తూ ఇలాంటి 'బరువు తగ్గించే' ప్యాక్‌లతో సమస్యలను 'కొని' తెస్తున్నారు. ఇక నుంచైనా ఇటువంటి ప్యాక్‌ల జోలికి వెళ్లకుండా.. వైద్యులను సంప్రదించి మందులను వాడితే మంచిదని మరిచిపోకండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top