మోహన్ బాబు, చిరంజీవిలు కలిసి మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసారు. అయితే ఇద్దరిలో ఎవరు టామ్...ఎవరు జెర్రి అనేది అన్ని చోట్లా హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవం ఆయన జన్మదినోత్సవం తిరుపతికి సమీపంలోని శ్రీరంగంపేటలో జరిగినప్పుడు ఈ వేడుకలకు హాజరైన చిరంజీవి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..'మోహన్‌బాబుతో నా అనుబంధం 30 ఏళ్లు. మనిషి మాట కరుకు అయినా మనసు చెరకు. అతనితో స్నేహం ఏర్పడితే ఆ బంధం నుంచి ఎవరూ బయటకి పోలేరు. ఆయన కష్టజీవి. శ్రమతో ఈ స్థాయికి వచ్చాడు. ఎవరో అన్నారు ఈ మధ్య మా అనుబంధం గురించి.. టామ్ అండ్ జెర్రీ అని. అవును నిజమే. ఒకర్ని మంచి ఒకరు అలా ఉండాలి అని. తెలుగువాడు ఎక్కడున్నా గర్వించేలా ఈ విద్యాసంస్థలను మోహన్‌బాబు నెలకొల్పాడు. నటుడుగా లభించే తృప్తి కన్నా విద్యాసంస్థల అధినేతగా ఆయన పొందే అనుభూతి, తృప్తి ఎక్కువ' అన్నారు చిరంజీవి. మోహన్‌బాబు మాట్లాడుతూ 'చిరంజీవితో నా స్నేహం మరువలేనిది. మధ్యలో కొందరు మనస్పర్థలు తెచ్చిపెట్టినా అది వాళ్లకే నష్టం కానీ మా ఇద్దరికీ ఏం కాదు. మంచి నటుడు, మంచి మనిషి చిరంజీవి' అన్నారు. ఇంతకీ ఇద్దరిలో టామ్ ఎవరు..జెర్రీ ఎవరంటారు.
చిరంజీవి, మోహన్ బాబులలో టామ్ ఎవరు..జెర్రీ ఎవరు?
teluguLifestyle Editor
5:25:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.