అల్లు అర్జున్ వివాహంని మా టీవీ ఛానెల్ వారు లైవ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లైవ్ సమయంలో రేటింగ్స్ విరరీతంగా రావటంతో ఇప్పుడు మిగతా స్టార్స్ వివాహం లైవ్ లు కూడా మంచి రేటు కి అమ్ముకోవచ్చనే ఆలోచన అందరిలో బయిలుదేరింది. త్వరలో కానున్న జూ.ఎన్టీఆర్ వివాహం లైవ్ కు కూడా మంచి రేటింగ్స్ వస్తాయని ఇప్పుడే పోటీ మొదలైంది. అయితే ఎన్టీఆర్ కాబోయే మామగారు నార్నే శ్రీనివాసరావుకి స్వంత ఛానెల్ స్టూడియో- ఎన్ ఉండటంతో ఈ లైవ్ వారి ఛానెల్ లో నే వేస్తారనే అందరూ ఆసించారు. అయితే తమ ఛానెల్ కన్నా మా టీవీ కానీ, జెమినీ టీవీ కానీ అయితే ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉందని, అంతేగాక మంచి రేటు పలికే అవకాశం ఉందని వీరిలో ఒకరిని ఫిక్స్ చేసి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నాగార్జున రికమెండేషన్ తో మా టీవీ వారు ఈ పోటీలో పాల్గొంటున్నారని, జెమినీవారు కేవలం తమ రేటింగ్ ని చూపి లైవ్ ఇమ్మంటున్నారని సమాచారం. మరి నార్నేశ్రీనివాసరావు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
జూ ఎన్టీఆర్ వివాహం 'లైవ్' అమ్మకానికి పెట్టారా?
teluguLifestyle Editor
3:43:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.