ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారు పాస్‌వర్డ్‌ల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారు పాస్‌వర్డ్‌ల విషయంలో అప్రమత్తంగా లేకపోతే తగిన మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ తరహా మోసాలకు చెక్ పెట్టవచ్చు.

  •  యూజర్‌నేమ్‌లకు, పాస్‌వర్డ్‌లకు నిక్‌నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, పెట్ నేమ్స్‌ను పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు. మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు అంచనా వేయడం ద్వారా పాస్‌వర్డ్‌ను గుర్తిస్తుంటారు.
  •   కొందరు రెడిఫ్, యాహూ, జీ మెయిల్‌కు ఒకే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒక దాని పాస్‌వర్డ్ తెలిస్తే అన్ని అకౌంట్లలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది.
  •   పాస్‌వర్డ్ చిన్నగా ఉంటే సులభంగా గెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్ వీలైనంత పొడవుగా ఉండేలా చూసుకోవాలి.
  •   క్యారెక్టర్‌లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, పాస్‌వర్డ్‌లో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు మిళితమై ఉండేలా జాగ్రత్త పడటం, అంకెలు ఉండేలా పెట్టుకోవడం చేయాలి.
  •   ఇంగ్లీషు డిక్షనరీలోని పదాలను అసలు ఉపయోగించవద్దు. 12345678 అంకెలను పెట్టుకోవడం, చఛఛిఛ్ఛీజజజి అల్ఫాబెట్స్‌ను వరుస క్రమంలో ఉపయోగించడం అసలు మంచిది కాదు.
  •   పుట్టి పెరిగిన ఊరు పేరు, పిల్లల పేర్లు ఉపయోగిస్తే సులువుగా ఇతరులు గెస్ చేయడానికి అస్కారం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకూడదు.
  •   కీబోర్డుపై పక్కపక్కన ఉండే అక్షరాలను వాడకూడదు. పాస్‌వర్డ్‌లో స్పెల్లింగ్ తప్పుగా ఉండేటట్లుగా చూసుకోవడం, మధ్యలో అంకెలను ఉపయోగిస్తే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top