మీ కోసం సింగిల్ ఎక్సర్‌సైజ్!

'బెస్ట్ సింగిల్ ఎక్సర్‌సైజ్' అంటూ ఒకటుంటుందా...? ఉంటే ఎంత బాగుంటుంది అనుకునేవాళ్లకు ఇదొక శుభవార్త. ఈత కొలనులో బటర్‌ఫ్లై కొడితే చాలంటున్నారు పరిశోధకులు. బటర్ ఫ్లై అంటే కాళ్లు, చేతులు బాగా చాపి కిందికి లేస్తూ ఈత కొట్టాలి. ఒకే ఒక ఎక్సర్‌సైజ్ చేయాల్సి వస్తే ఇంతకంటే మంచి కసరత్తు మరొకటి లేదని వారి అభిప్రాయం.

స్విమ్మింగ్ ఫూల్‌లో ఒకసారి అటూఇటూ బటర్‌ఫ్లై చేస్తే- గంటకు 14 కిలోమీటర్ల వేగంతో సైకిల్ తొక్కిన దానికి, పది నిమిషాల్లో ఒక కిలోమీటరు పరిగెత్తిన దానికి సమానం. అంతేకాదు, నాలుగైదు అంతస్థుల మీదికి ఫర్నీచర్ మోసుకెళ్లినా, గంటసేపు బాస్కెట్‌బాల్ ఆడినా ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయో.. బటర్‌ఫ్లై చేసినప్పుడు కూడా అన్నే క్యాలరీలు ఖర్చవుతాయి. ఈతకొలనులో అరగంట బటర్‌ఫ్లై స్విమ్మింగ్ చేస్తే.. ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలుగుతాయి. దీంతో అవి మరింత దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయని జాన్ మూర్స్ యూనివర్శిటీలో జరిగిన పరిశోధనలో తేలింది. కొత్తగా బటర్‌ఫ్లై చేయాలనుకునేవాళ్లు మాత్రం నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుంటేనే మంచిది.


వారానికి కనీసం రెండు మూడుసార్లు బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ చేస్తే కండరాలు, నరాల్లో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. అన్ని అవయవాలతోపాటు పుష్కలంగా ప్రాణవాయువు అందుతుంది. దానివల్ల శరీరంలో పటుత్వం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా దరి చేరవ'ని యూనివర్శిటీ పరిశోధక విభాగం పేర్కొంది. ఎక్సర్‌సైజ్‌లు, వాకింగ్, యోగా... వీటిలో ఏ ఒక్కటీ చేయని వాళ్లు... కనీసం ఈ 'సింగిల్ ఎక్సర్‌సైజ్' అయినా చేస్తే ఎంతో ఉపయోగం. ఇప్పుడసలే ఎండాకాలం. బటర్ ఫ్లై కొట్టేందుకు ఇంతకంటే మంచి సమయం మళ్లీ దొరుకుతుందా చెప్పండి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top