వ్యాయామం చేయాలంటే బద్దకమా! - వారి కోసం పలు చిట్కాలు

రోజూ ఉదయం లేచి వాకింగ్‌కు వెళ్లాలంటే చాలా మంది బద్దకంగా ఫీలవుతుంటారు. కొంతమంది మూడు రోజులు చేసి నాలుగో రోజు డుమ్మా కొడుతుంటారు. మరి కొంతమంది రోజూ అవే వ్యాయామాలు చేసి బోర్‌గా ఫీలవుతున్నాం అంటుంటారు. ఇటువంటి వారి కోసం పలు చిట్కాలు.

  •  రోజూ వాకింగ్‌కు వెళ్లడానికి బోర్‌గా ఫీలయ్యే వారు స్నేహితుడు లేదా భాగస్వామి తీసుకుని వెళ్లండి. స్నేహితులు లేకపోతే మ్యూజిక్ వింటూ వాకింగ్ చేయండి.
  • ఖరీదైన జిమ్‌లో చేస్తేనే వ్యాయామం అనిపించుకోదు. పరిగెత్తడానికి ట్రెడ్‌మిల్స్ ఉండనక్కర్లేదు. పార్కులో పరిగెత్తినా చాలు. బ్యాడ్మింటన్ వంటి గేమ్స్ ఆడితే మరీ మంచిది. అలసట తెలియకుండా వ్యాయామం పూర్తవుతుంది.
  •   కంఫర్టబుల్‌గా ఉండే దుస్తులు ధరించండి. రన్నింగ్ షూస్ తప్పనిసరి.
  •   ఒక్కరోజులోనే ఫలితం కనిపించాలంటే కుదరదు. అదనంగా ఉన్న కొవ్వు కరగాలంటే సమయం పడుతుంది. అప్పటి వరకు క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి. మూడు రోజులు చేసి నాలుగో రోజు మానేయడం కాకుండా హాబీలాగా అలవర్చుకోవాలి.
  • జిమ్‌లో వ్యాయామం చేయడం బోర్ కొడుతుంది. అందుకే రోజూ ఏదో ఒక గేమ్ ఆడటం అలవాటు చేసుకోండి. కాస్త భిన్నమైన వర్కవుట్స్‌ను చేయడానికి ప్రయత్నించడం ద్వారా బోర్ ఫీల్ కాకుండా చూసుకోవచ్చు.
  •   వ్యాయామం చేసే సమయాన్ని క్రమంగా పెంచుతూ పోవాలి. వారంలో మూడు రోజులు అరగంట పాటు వాకింగ్ చేయడం ప్రారంభించి, క్రమంగా ఐదు రోజులకు పెంచండి.
  •   మారథాన్, సైక్లొథాన్ వంటి కార్యక్రమాలలో యాక్టివ్‌గా పారిస్టిపేట్ చేయండి. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఉత్తేజం లభిస్తుంది.
  •   శరీరానికి విశ్రాంతి కూడా అవసరమే. వారంలో ఒక రోజు శరీరానికి వ్యాయామం నుంచి విశ్రాంతి ఇవ్వండి. కండరాలు బలోపేతం కావడానికి, నొప్పులు తగ్గడానికి ఇది ఉపకరిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top