సాధారణంగా ముక్కునుంచి ఎండాకాలం రక్తం కారుతుంటుంది. చిన్నపిల్లల్లోనూ ఎక్కువగాను, పెద్దవారిలోనూ అపుడుడపుడు ఈ స్థితి కనిపిస్తుంటుంది. ఇలా జరిగినపుడు ముందుగా ముక్కు ముందు భాగాన్ని రెండు వేళ్లతో నొక్కి పట్టుకోవాలి. ఈలోగా రక్తస్రావం ఆగిపోతుంది. ఇంకా అలానే ఉంటే తలను కొద్దిగా ముందుకువంచి నోటితో గాలి పీల్చుకోవాలి. గొంతులోకి రక్తం వస్తే ఉమ్మివేయాలి. ముక్కుపైన తడిగుడ్డను కానీ, అయస్ముక్కగాని పెట్టిఉంచితే కొద్దిసేపటికి రక్తం కారడం తగ్గుతుంది. ఇప్పటికీ ముక్కు నుంచి రక్తం కారుతూనే ఉంటే వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకుని పోవాలి. రక్తం కారడం ఆగిపోయనా కూడా ఒకసారి డాక్టరుకు చూపించి ముక్కు ఏదైనా వ్యాధికి గురి అయనదో, లేక ఇతర వ్యాధుల వల్ల రక్త స్రావం జరిగిందా అని తెలుసుకొని వాటికి చికిత్స చేయంచుకోవడం చాలా అవసరం. ముక్కును ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
ఎండాకాలంలో ముక్కు - జాగ్రత్త
teluguLifestyle Editor
2:46:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.