కొబ్బరి పెసర పూర్ణాలు


కావల్సినవి:
కొబ్బరి తురుము, పెసరపప్పు, పంచదార, మినప్పప్పు- కప్పు చొప్పున, బియ్యం- రెండుకప్పులు, నూనె- వేయించడానికి సరిపడా, యాలకులపొడి- అర చెంచా.
తయారీ: 

ముందురోజు మినప్పప్పు, బియ్యం కలిపి నానబెట్టుకొని మర్నాడు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును రెండు గంటలపాటు నానబెట్టి తడిలేకుండా మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని వేసి ఆవిరి మీద ఉడికించాలి. చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి. అందులో కొబ్బరికోరు, పంచదార, వేసి పొయ్యి మీద పెట్టాలి. పంచదార కరిగి మిశ్రమం దగ్గర పడ్డాక యాలకుల పొడి చల్లి దించేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని మినప్పిండిలో ముంచి వేయాలి. బాగా వేగాక దించేస్తే కమ్మని కొబ్బరి పెసర పూర్ణాలు తయారయినట్టే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top