కొబ్బరి అప్పాలు


కావల్సినవి: 
బియ్యం - కేజీ, బెల్లం - అరకేజీ, కొబ్బరికాయ - ఒకటి, నూనె- అరకేజీ.
తయారీ: 
బియ్యాన్ని ముందురోజే ఓ రాత్రంతా నానబెట్టుకోవాలి. నీళ్లన్నీ వంపేసి.. పిండి పట్టించాలి. కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఓ వెడల్పాటి గిన్నెలో బెల్లం, కాసిని నీరు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. బెల్లం కరిగి ఉండపాకం వచ్చాక దింపేయాలి. ఇందులో కొబ్బరి తురుము, బియ్యంపిండి, కొద్దిగా నూనె చేర్చి.. బాగా కలిపి పదిహేను నిమిషాలు నాననివ్వాలి. బాణలిలో నూనె వేడి చేశాక.. ఓ ప్లాస్టిక్‌ కవరుపై ఈ మిశ్రమాన్ని అప్పాల్లా అద్ది వేయించాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేస్తే కమ్మని, వేడివేడి అప్పాలు సిద్ధం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top