పనీర్‌ శాండ్‌విచ్‌


కావల్సినవి: 
పనీర్‌- 250గ్రాములు, ఉల్లిపాయ తరుగు- అరకప్పు, కొత్తిమీర- కొద్దిగా, మిరియాలపొడి- చెంచా, మిరియాలు- ఆరు, వెల్లుల్లిముద్ద- చెంచా, ఉప్పు- రుచికి తగినంత, చాట్‌మసాలా- అరచెంచా, పుదీనా తరుగు- రెండుకప్పులు, పచ్చిమిర్చి- మూడు, నిమ్మరసం- కొద్దిగా, శాండ్‌విచ్‌ బ్రెడ్‌- రెండు ప్యాకెట్ల్‌, వాము- చెంచా, వెన్న- పావుకప్పు, టమాటా సాస్‌- అరకప్పు, గ్రీన్‌చట్నీ- అరకప్పు.
తయారీ:
పనీర్‌ను ముక్కలుగా తరిగి.. రెండు విజిళ్లు వచ్చే వరకు ఉంచి దించేయాలి. చల్లారాక నీళ్లు వంపి చేత్తో మెత్తగా మెదపాలి. ఈ ముద్దకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, మిరియాల పొడి, చాట్‌మసాలా, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి.. వాటికి వాము, మిరియాలు కలిపి మిక్సీలో వేసి ముద్దగా చేసి ఉప్పు, నిమ్మరసం జోడించాలి. తరవాత ఒక బ్రెడ్‌ స్త్లెసు మీద వెన్న దానిపైన టమాటా సాస్‌ను పూతగా రాయాలి. మరో స్త్లెసు మీద గ్రీన్‌చట్నీ, సిద్ధంచేసి పెట్టుకున్న పనీర్‌ ముద్ద ఉంచి.. మొదటి స్త్లెసుతో కప్పేసి త్రికోణాకృతిలో కోసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను టోస్టర్‌ లేదా పాన్‌ మీద నూనెతో కాల్చుకొంటే పనీర్‌ శాండ్‌విచ్‌ సిద్ధమయినట్టే. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top