సేమియా పరోటా


కావల్సినవి: 
సేమియా - కప్పు, గోధుమపిండి - రెండుకప్పులు, పచ్చిమిర్చి మిశ్రమం - రెండు చెంచాలు (అవసరాన్ని బట్టి మరికాస్త వేసుకోవచ్చు), ఉప్పు - రుచికి తగినంత, నువ్వులు - రెండు చెంచాలు, నెయ్యి - రెండు చెంచాలు, నూనె - కాల్చడానికి సరిపడా, కొత్తిమీర - కట్ట (సన్నగా తరగాలి). 
తయారీ: 
గిన్నెలో గ్లాసు నీరు తీసుకుని మరిగించాలి. అందులో సేమియా వేసి ఉడకనివ్వాలి. ఆ తరవాత నీళ్లు వంపేసి.. సేమియాను చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ చేర్చి చపాతీపిండిలా కలపాలి. అవసరమైతే మరికాసిని నీళ్లు చల్లుకోవాలి. రెండు చెంచాల నూనె వేసి పిండిని మరోసారి కలిపి అరగంట నాననివ్వాలి. ఈ పిండిని చపాతీల్లా వత్తుకుని పెనంపై రెండువైపులా నూనెతో కాల్చాలి. వేడివేడి సేమియా పరోటా సిద్ధం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top