స్లిమ్‌గా ఉండేందుకు సప్తపది

మనకు ఎంత సంపద ఉంది? నెలకు ఎంత జీతం వస్తుంది? అనేది ముఖ్యం కాదు. మనం ఎంత ఆరోగ్యంగా, నాజూగ్గా ఉన్నామనేది ముఖ్యం. మన ఆరోగ్యాన్ని శాసించేది ఆహారం. తిండి విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటూ, నిత్యం వ్యాయామం చేస్తే సలక్షణమైన జీవితం మన సొంతం అవుతుంది.అందుకోసం సూచిస్తున్న ఏడు మార్గాలు ఇవి.

1. ప్రతి రోజు మూడు పూటలా కొద్దిమోతాదులో ఆహారం తీసుకోవాలని అంటున్నారు పోషకాహార నిపుణులు. రోజుకు రెండు సార్లు లేదా మూడు సార్లు భోజనం చేయడంతోపాటు డ్రై ఫ్రూట్స్ లేక పండ్లు లేక కూరగాయలు స్నాక్స్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు.
 

2. మీ ఆహారంలో రోజుకు కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఇందులో రెండు నుంచి నాలుగు తాజా పండ్లు తీసుకోవాలి. తృణధాన్యాలతోపాటు పెరుగు, ఫ్రూట్ సలాడ్‌లను స్నాక్స్‌గా తీసుకోవచ్చు.
 

3. మీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీని వల్ల రోజంతా మీరు శక్తివంతంగా ఉండగలుగుతారు. పీచు పదార్థాలు తీసుకోకుంటే మధుమేహం లాంటి దుష్పరిణామాలు వచ్చే అవకాశముంటుంది. నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది.
 

4. కొవ్వు చేరని ఆహార పదార్థాలు తీసుకోండి. 100 గ్రాముల పాల ఉత్పత్తుల్లో మూడు గ్రాముల కొవ్వు ఉంటుంది. అందువల్ల కొవ్వు తక్కువ ఉన్న పాల పదార్థాలతో పాటు స్కిన్‌లెస్ చికెన్ లాంటివి తీసుకుంటే మంచిది.
 

5. మాంసాహారులయితే వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలు తీసుకోండి. శాకాహారులు చిరుధాన్యాలు అధికంగా తీసుకోవచ్చు.
 

6.మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోండి. సోడియం రోజుకు 2,300 మిల్లీగ్రాములు అంటే ఓ టీస్పూన్‌కు మించకుండా ఉండేలా జాగ్రత్త వహించండి. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్ వంటి పదార్థాలను తినవద్దు అంటున్నారు పోషకాహార నిపుణులు.
 
7. రోజూ ఒక గంట సేపు మనది కాదనుకొని వ్యాయామానికి కేటాయించాలి. తద్వారా రోజంతా చురుగ్గా ఉండడంతో పాటు నాజూగ్గా, ఆరోగ్యంగా ఉండవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top