జీడిపప్పు కూర్మా

కావలసినవి:
జీడిపప్పు: 150 గ్రా., పన్నీర్ తురిమినది:అరకప్పు, కిస్‌మిస్: రెండు టేబుల్ స్పూన్లు, గరం మసాలా,అల్లం పేస్ట్‌లు: ఒక్కో స్పూన్, ఒక పెద్దఉల్లిపాయ, నాలుగు పచ్చిమిరపకాయలు, టమోటా పేస్ట్, పచ్చికొబ్బరి తురం, నెయ్యు, మంచి నూనె చెరో రెండు స్పూన్స్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, మిర్చిపొడి తగినంత.

తయారు చేయు విధానం: 

ముందుగా జీడిపప్పు, కిస్‌మిస్ నేతిలో వేయించి పెట్టుకోవాలి. తరువాత నెయ్యిలో ఉల్లి, మిర్చి వేయించాలి. దీంట్లో అల్లం, టామోటా పేస్ట్‌లు వేయించి, ఉప్పువేసి దాంట్లో కొంచెం నీరు పోసి మూతపెట్టాలి. గుజ్జుగా అయిన తరువాత పెరుగు క్రీప్ వేసి బాగా కలిపి నిమిషం దాటాక దాంట్లో గరం మసాలా వేసి, జీడిపప్పు, కిస్‌మిస్‌లువేసి ఇంకో నిమిషం మూతపెట్టిన తరువాత దించి కొబ్బరితురుంపైన కొత్తిమీర, పన్నీరు వేసి సర్వ్ చేయాలి. ఇది పరోటా, చపాతీల్లోకి బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top