కావల్సినవి :
మైదా- పావుకేజీ, పంచదారపొడి- 125గ్రాములు, యాలకుల పొడి- చెంచా, డాల్డా- కప్పు.
తయారీ :
మైదాపిండిని గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దికొద్దిగా డాల్డా వేసి కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి పంచదార పొడి, యాలకులపొడి వేసి కలిపి ముద్దగా తయారుచేయాలి. గంటయ్యాక పిండిని ఉండలుగా చేసి మందంగా కర్రతో చపాతీలా ఒత్తాలి. ఇప్పుడు అర్థచంద్రాకారంలో ఉన్న బిళ్లలు వచ్చేలా దానిమీద పదునుగా ఉన్న గ్లాసు అంచుతో నొక్కాలి. ఇలా వచ్చిన బిళ్లలను ట్రేలో తీసుకొని కొద్దిసేపు బయట ఉంచి తరవాత ఓవెన్లో బేక్ చేసి బయటకు తీయాలి. చల్లారాక బిస్కెట్లు సిద్ధమయినట్టే. పిల్లలు ఇష్టంగా తినే ఈ బిస్కెట్లు వారం రోజుల దాకా నిల్వ ఉంటాయి.