కావల్సినవి:
బ్రెడ్- పది ముక్కలు, బొంబాయి రవ్వ- అరకప్పు, బియ్యం పిండి- చెంచా, ఉప్పు- తగినంత, మినప్పప్పు- రెండు చెంచాలు, ఉల్లిపాయ తరుగు- కప్పు, పచ్చిమిర్చి- నాలుగు, అల్లం- చిన్నముక్క, కరివేపాకు- నాలుగు రెబ్బలు, ఆవాలు- చెంచా, పెరుగు- చెంచా, నూనె- పావుకప్పు.
తయారీ:
బ్రెడ్ ముక్కల అంచులు తొలగించి నీళ్లలో ముంచి తీసి పిండి ఇంకో గిన్నెలో వేయాలి. అందులో రవ్వ, బియ్యంపిండి, ఉప్పు, వెన్న, తగినంత పెరుగు చేర్చి గరిటె జారుగా కలిపి పెట్టాలి. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, తరిగిన అల్లం, పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఒకదాని తరవాత ఒకటి వేయాలి. కొద్దిసేపటికి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాక దించేయాలి. చల్లారాక బ్రెడ్ మిశ్రమంలో వేసి బాగా కలియతిప్పాలి. తరవాత పెనం పొయ్యి మీద పెట్టి వేడయ్యాక పిండితో దోశ వేసి రెండువైపులా కాల్చాలి.కావాలనుకొంటే ఉల్లిపాయ తరుగు వేసుకోవచ్చు. బ్రెడ్దోశను కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.