మసాలా కార్న్...


కావలసిన పదార్థాలు:
స్వీట్‌కార్న్ పొత్తులు - రెండు, ఉల్లిపాయలు - రెండు, గరంమసాలా - ఒక టీస్పూను, ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు, జీలకర్ర - అర టీ స్పూను, కారం - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 
తయారుచేయు విధానం:
ఒక్కో పొత్తుని ఆరు ముక్కలు చేసుకోవాలి. వీటిని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించి పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి బాగా కాగాక జీలకర్ర, ఉల్లిపాయముద్ద వేయాలి. ధనియాల పొడి, కారం, గరంమసాలా, ఉప్పు కూడా వేసి బాగా వేగించాలి. తరువాత ఒక గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. అందులో ఉడికించిపెట్టుకుని స్వీట్‌కార్న్ ముక్కల్ని వేసి కాసేపుంచాలి. నీళ్లన్నీ పోయేవరకూ ఉడికించి దించేయాలి. ఘుమ ఘుమలాడే మసాలా కార్న్ సిద్ధమయినట్టే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top