నిమ్మరసం టేబుల్‌స్పూన్, కోడిగుడ్డు తెల్లసొన రెండు టేబుల్‌స్పూన్లు, తేనె రెండు టేబుల్‌స్పూన్లు, స్ట్రాబెర్రీ గుజ్జు అర కప్పు తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తుంటే చర్మం జిడ్డు తగ్గిపోయి నునుపుగా, కాంతివంతంగా తయారవుతుంది.