గుండెల్లో మంటగా అనిపిస్తోందా... పంటినొప్పి బాధిస్తోందా... జలుబుతో సతమతమవుతున్నారా... ఆందోళన చెందకండి.

గుండెల్లో మంటగా అనిపిస్తోందా... పంటినొప్పి బాధిస్తోందా... జలుబుతో సతమతమవుతున్నారా... ఆందోళన చెందకండి. ఒక్కసారి మీ వంటింట్లోని పోపులపెట్టెలోకి చూడండి... కనిపించాయా నల్లని పూవెుగ్గలు... ... అవేనండీ లవంగాలు. అద్భుత ఔషధ సుగంధద్రవ్యాలు!

అద్భుత ఔషధం!
లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.
* పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగవెుగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.
* లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి  తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.
* లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.
* పెద్దపేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మజీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్‌' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందు.
* రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక మాయమవుతుందట.
* రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది.
* జలుబుతో బాధపడేవాళ్లు కర్చీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే ఫలితం ఉంటుంది.
* ఏడువెుగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించాలి. తరవాత దాన్నించి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరవాత ఆ నీళ్లను తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి కాస్తంత హాయి.
* లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవడంతోబాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్‌, ఆర్త్థ్రెటిస్‌, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట.
 

వెుత్తమ్మీద ఆహారంలో భాగంగా లవంగాలను తీసుకోవడంవల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం పెరిగి హానికరమైన ఆక్సీకరణ ప్రక్రియతగ్గి రోగాలు రాకుండా ఉంటాయి. శరీరంలో అధికంగా ఉండే కొవ్వూ తగ్గుతుందట. 

..అయితే గర్భిణులు, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, బౌల్‌ సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు దీన్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మరీ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నది మరువకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top