పాత అలవాటు ప్రకారం 'స్మైల్ ప్లీజ్' అంటూ అరుస్తున్నాడు

"ఇతగాడికి ఎంత ఫోటో స్టూడియోలో పనిచేసిన అనుభవమున్నా ... మన సినిమాకి కెమెరామాన్‌గా పనికిరాడంటే మీరు విన్నారు కాదు'' కోపంగా అన్నాడు దర్శకుడు యదువంశీ.
"వాడు మా ఆవిడకి తమ్ముడి వరసయ్యా... ఏం జరిగింది?'' గొణిగాడు నిర్మాత సుబ్బరాజు.
"నేను ఒక పక్క హీరోయిన్‌ని ఏడవమని చెబుతుంటే ... అతగాడు మరోపక్క నుండి పాత అలవాటు ప్రకారం 'స్మైల్ ప్లీజ్' అంటూ అరుస్తున్నాడు'' బేరుమన్నాడు యదువంశీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top