మీ హాలిడే ట్రిప్ ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్లాన్ ఇలా........

డిసెంబర్ వచ్చేసింది. ఈ నెలలో పిల్లలకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు అయిపోతాయి. క్రిస్మస్ సెలవులు వచ్చేస్తాయి. సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలు ఎక్కడికైనా వెకేషన్‌కు వెళదామని మారాం చేస్తారు. ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటే మీ హాలిడే ట్రిప్ ఎటువంటి టెన్షన్స్ లేకుండా సాఫీగా సాగిపోతుంది. హాలిడే ట్రిప్‌కు తీసుకోవలసిన కొన్ని ప్రధాన జాగ్రత్తలు...

*ముందు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో మీరు, మీ శ్రీమతి, పిల్లలు కలసి డిస్కస్ చేసుకోండి. ముందు వెళ్లాల్సిన ప్రదేశం ఖరారైతే మీతో ఏమేమి వస్తువులు తీసుకెళ్లాలో ఆలోచించవచ్చు.
 

*సెలవులను ఎంజాయ్ చేయాలని పిల్లలకే కాదు పెద్దలకూ ఉంటుంది. నిజానికి మనందరం కొన్ని ప్రదేశాలకు వెళ్లాలని ఎప్పట్నుంచో కలలు కూడా కంటూ ఉంటాం. అయితే కల నెరవేరాలంటే మన ఆర్థిక పరిస్థితి కూడా సహకరించాలి కదా! అందుకే ఏ ట్రిప్‌కైనా బడ్జెట్ తప్పనిసరి.
 

*రాను పోను ప్రయాణ ఖర్చులు, అక్కడ భోజన, వసతి సౌకర్యాల ఖర్చు, లోకల్ సైట్ సీయింగ్ కోసం ట్యాక్సీలకయ్యే రెంటల్స్ వంటివి అన్నీ కలుపుకుని బడ్జెట్ తయారు చేయండి. మీ బడ్జెట్‌లో ఉంటేనే ట్రిప్‌ను ప్లాన్ చేసుకోండి.

*మీరు వెళ్లాలనుకుంటున్న హాలిడే స్పాట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇంటర్‌నెట్ , గైడ్ పుస్తకాలు, ట్రావెల్ మేగజైన్స్‌లో మీకు కావలసిన సమాచారం లభించగలదు.
 

*మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలు, బస చేయడానికి అందుబాటులో ఉన్న హోటల్స్ వివరాలు తెలుసుకోండి. నెట్ ద్వారానో, టెలిఫోన్ ద్వారానో హోటల్‌లో గదులను ముందుగానే బుక్ చేసుకోండి. లేకపోతే వసతి లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
 

*ప్రయాణంలో ఆకలి ఇబ్బందులు ఉండకుండా నాలుగైదు రోజులు నిల్వ ఉండే స్నాక్స్‌ని కూడా మీ వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి. ముఖ్యంగా పిల్లలు ఉన్నపుడు ఇవి తప్పనిసరిగా మీ బ్యాగులో ఉండాల్సిందే.
 

*సాధ్యమైనంత వరకు కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. ఆఫీసు టెన్షన్లను అక్కడకు తీసుకెళ్లి అందరి మూడ్ పాడుచేయకండి. మళ్లీ ఇంటికి వచ్చేవరకు ఆఫీసు మాట మరిచిపోయి పిల్లలతో సరదాగా గడపండి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top