మిక్స్‌డ్ చిక్కి...(DRY FRUITS)


బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా, పల్లీలు, ఓట్స్...అన్నీ ఆరోగ్యాన్ని కాపాడేవే. రోజూ నాలుగు పప్పులు నోట్లో వేసుకుంటే బోలెడంత బలం. ఏ పప్పు తిన్నా...కొద్దిగా బెల్లం ముక్క బుగ్గన పెట్టుకుంటే పైత్యం ఉండదంటారు. విడివిడిగా తినడం దేనికి? అన్ని  కలిపి పాకం పట్టేస్తే (నోట్లోకి హాయిగా) పోతుంది కదా!

మిక్స్‌డ్ చిక్కి...
 కావాల్సిన పదార్థాలు: 
జీడి పప్పు - 100 గ్రాములు, బాదం పప్పు - 100 గ్రాములు, పిస్తా - 30 గ్రాములు, పల్లీలు - 150 గ్రాములు, నువ్వులు - ఒక టేబుల్ స్పూను, బెల్లం ఒక కప్పు, పంచదార - అర కప్పు, నెయ్యి - 100 గ్రాములు.
తయారుచేయు విధానం:

ముందుగా అన్ని పప్పుల్ని వేగించుకుని పెట్టుకోవాలి. చల్లారాక రోట్లో వేసి కచ్చా పచ్చాగ దంచుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి కొద్దిగా నెయ్యి వేయాలి. దానిలోనే బెల్లం, కొద్దిగా నీళ్లు కూడా పోసి మరిగించాలి. పాకం వచ్చాక దించేసి అందులో దంచిపెట్టుకున్న పప్పుల ముద్దని వేసి బాగా కలపాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top