ఒకేతరహా డ్రెస్సులు...అయినా ప్రత్యేకంగా కనపడటం ఎలా?

బేసిక్‌గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే సల్వార్ కమీజ్ వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా, శారీ అయినా ఒకే హెయిర్ స్టైల్, ఒకే చెప్పులు, ఒకే బ్యాగ్ ... వాడుతుంటారు. సల్వార్ కమీజ్ అనుకోండి కోలాపురి, ఎంబ్రాయిడరీ ఉన్న చెప్పులు.. జూట్, ఎంబ్రాయిడరీ బ్యాగులు.. కుందన్, ఎనామిల్ జ్యుయలరీ వాడితే బాగుంటుంది. ప్రతీ డ్రెస్‌కి యాక్సెసరీస్, జ్యూయలరీ, హెయిర్ స్టైల్స్ మారిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. జీన్స్ వేసుకున్నప్పుడు కర్లీ హెయిర్, పెద్ద వాచ్, చిన్న హ్యాంగింగ్స్, స్పోర్ట్‌షూ, పంప్‌షూ వేసుకుంటే బాగుంటుంది. గౌన్లు వేసుకుంటే చెవులకు పెద్ద పెద్ద హ్యాంగిగ్స్, నాట్స్ ఉన్న హెయిర్‌స్టైల్, స్ట్రాప్స్ ఉన్న పెన్సిల్ హీల్స్ వేసుకోవాలి. లెదర్, షిమ్మర్ మెటీరియల్‌తో చేసిన పెద్ద హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవాలి. శారీ ధరిస్తే గోల్డ్, కాపర్, సిల్వర్ చెప్పులు అదీ స్టోన్స్‌తో చేసిన ఎంబ్రాయిడరీ ఉన్నవి ధరించాలి. ఎంబ్రాయిడరీ ఉన్న క్లచెస్ పట్టుకోవాలి. ఏ హెయిర్ స్టైల్ అయినా చీరకు నప్పుతుంది. ప్రతీ డ్రెస్‌కి మేకప్ కూడా బాగుండాలి. ఐ షేడ్స్, లిపిస్టిక్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. గౌన్లు వేసుకుంటే గ్లిట్టర్ ఉన్న ఐ షేడ్స్, లిప్‌స్టిక్ ఎంపికచేసుకోవాలి. వెస్ట్రన్ డ్రెసెస్‌కి ముత్యాలు, బీడ్స్ బాగుంటాయి. ధరించే ప్రతి డ్రెస్‌కు హెయిర్ స్టైల్, యాక్ససరీస్ మార్చుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top