క్యాప్పికం మష్రూమ్స్‌ కూర


కావలసిన పదార్థాలు:
క్యాప్పికం -1, ఆలు - 2, మష్రూమ్స్ - 10, కరివేపాకు - 4 రెబ్బలు, జీలకర్ర, ఆవాలు - 1 టీ స్పూను చొప్పున, నూనె - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కారం /మిరియాలపొడి - అర టీ స్పూను. కొత్తిమీర తరుగు - గుప్పెడు. 
తయారుచేసే విధానం:
 ముందుగా మష్రూమ్స్‌తో పాటు ఆలు, క్యాప్సికంలను శుభ్రం చేసి అరంగుళం ముక్కలుగా తరగాలి. కడాయిలో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేగించి ఆలూ ముక్కలు వేయాలి. ఇవి సగం ఉడికిన తర్వాత మష్రూమ్స్, క్యాప్సికం ముక్కలతో పాటు ఉప్పు, కారం వేసి రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి మూత పెట్టి ముక్కల్ని మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర అన్నంలో నంజుకోడానికి బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top