వైట్ డ్రెస్సులో విభిన్నంగా కనపడాలంటే ఏం చేయాలి? ఉన్న డ్రెస్సులను రీ మోడల్ ఎలా చేసుకోవచ్చు?

తెలుపు రంగు దుస్తులను బోర్ అనిపించకుండా ఎన్ని కలర్స్‌తోనైనా కాంబినేషన్ చేసి వేసుకోవచ్చు. గ్రీన్, పిస్తా గ్రీన్, బ్లాక్, బేబీ పింక్, రోజ్‌పింక్, రెడ్, పసుపు... ఇలా మీకు నచ్చిన ప్రతి కలర్‌తో వైట్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ధరించవచ్చు. రేడియమ్ ఎల్లో, లెమన్ ఎల్లోతో వైట్ కాంబినేషన్ మరింత అందంగా ఉంటుంది. సిల్వర్, గోల్డ్ కలర్ కాంబినేషన్స్‌తో తెలుపు దుస్తులను ధరిస్తే మరింత ఆకర్షణీయంగా కనపడతారు. తెలుపు రంగు దుస్తుల పైన ఏ ఎంబ్రాయిడరీ అయినా బ్రైట్‌గా కనిపిస్తుంది. అద్దం వర్క్, యాంటిక్ జరీ వర్క్, గోల్డ్ జరీ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ముత్యాలు, గవ్వలు, పూసలతో చేసిన వర్క్ కూడా చాలా బాగుంటుంది. తెల్లని సాదా డ్రెస్‌ను ధరించి, కలర్ దుపట్టాను వేసుకోండి. ఉదాహరణకు: వైట్ డ్రెస్ పైన బాందినీ దుపట్టా మరింత అందంగా కనిపిస్తుంది. నెట్ ఫ్యాబ్రిక్‌తో, జార్జెట్, షిఫాన్ లేసులతో తెలుపురంగు దుస్తులను డిజైన్ చేసుకోవచ్చు. తెలుపును మల్టీకలర్స్‌తో మిక్స్ చేయవచ్చు. అందులోనూ వేసవికి తెలుపును మించిన కూల్ కలర్ లేదు. దీనిని చాలా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేసుకోవడం అభిరుచి, సృజనాత్మకతను బట్టి ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top