చాక్లెట్‌తో మతిమరపు దూరం

ఒక వయసు దాటాక మతిమరపు రావడం సహజం. వృద్ధాప్యంలో దాపురించే అల్జైమర్స్ వ్యాప్తి ఇటీవల బాగా పెరిగింది. అయితే రోజూ పరిమిత మోతాదులో తీసుకునే చాక్లెట్ వల్ల వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు, అల్జైమర్స్‌ను నివారించవచ్చంటున్నారు. చాక్లెట్‌లో ఉపయోగించే కోకోలోని పోషకాల్లో ఫ్లేవనాల్ వల్ల ఈ మేలు ఒనగూరుతుందంటున్నారు వారు. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ఎల్ అక్విలాకు చెందిన వైద్యనిపుణుడు డాక్టర్ గియోవాబాటిస్టా దేసిదెరి ‘‘మితిమీరిన క్యాలరీలు తీసుకోకుండా పరిమితంగా కోకో ఉన్న చాక్లెట్లను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది’’ అని పేర్కొన్నారు. 

పరిమితంగా చాక్లెట్ డ్రింక్ (ఫ్లేవనాల్ డ్రింక్) తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అందుకే వృద్ధాప్యానికి ముందరే పరిమితంగా చాక్లెట్లు తినడం మంచిదంటున్నారు. చక్కెరవ్యాధి ఉన్నవారు మాత్రం ఈ విషయంలో మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాకే చాక్లెట్ మోతాదును నిర్ణయించుకోవడం మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top