కంటికి ప్రమాదం కలిగినప్పుడు.... వైద్యుని వద్దకు వెళ్లేలోగా ప్రథమ చికిత్స

- కంటికి గాయం తగిలినా, నలకలు పడినా, కళ్లను నులుముకోవడం మరింత ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే ... నలకలు వంటివి పడినప్పుడు వెంటనే చల్లటి నీళ్లతో శుభ్రంగా కడగాలి.
- శుభ్రమైన తడి బట్ట లేదా తడిపిన దూది ఉండ సాయంతో నలకను తీసేందుకు ప్రయత్నించాలి. అయితే రక్తగాయాలు తగిలినప్పుడు మాత్రం సాధ్యమైనంతవరకు కంటిని తడపడం, ఇంటిలో ఉన్న క్లెన్సర్లతో శుభ్రం చేయడం ప్రమాదకరం. 
- కంటికి వెలుతురు సోకకుండా నల్ల కళ్లద్దాలను ధరించాలి లేదా గుండ్రంగా కత్తిరించిన కాగితం లేదా వస్త్రంతో కప్పి ఉంచాలి. 
- ఒకవేళ రక్తస్రావం అవుతుంటే ఐసుముక్కలను మందపాటి వస్త్రంలో కట్టి, దానితో సున్నితంగా అద్దాలి. 
- బంతి వంటి వస్తువు తగిలితే కన్ను వాయకుండా తలను ఎత్తి ఉంచాలి. 
-రసాయనాలు వంటివి పడ్డప్పుడు వెంటనే చల్లటి నీటితో కనీసం ఐదు నిమిషాలపాటు శుభ్రంగా కడగాలి. సాధ్యమైనంతవరకు కంటిని కప్పి ఉంచకూడదు. కంటి నుంచి నీరు వస్తుంటే ఆపకూడదు. ఎందుకంటే కన్నీటి వల్ల సహజంగానే రసాయనాల తీవ్రత తగ్గుతుంది, నలకల వంటివి ఉంటే కన్నీటితో పాటు బయటికి వచ్చేస్తాయి. 
- వెంటనే వైద్యుని సంప్రదించాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top