సరదాగా టైంపాస్ చేయడానికి పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడేది పాప్‌కార్న్. ఏ సినిమాకో, షికారుగా బీచ్‌కో, పార్కుకో వెళ్లినపుడు చేతిలో పాప్‌కార్న్ కనపడని పిల్లలు ఉండరు. పాప్‌కార్న్ అంటే అది కేవలం కాలక్షేపం చిరుతిండి అని తేలిగ్గా కొట్టివేయకండి. పాప్‌కార్న్‌లో జలుబును వదిలించే ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు పెన్‌సిల్వేనియాలోని స్క్రాన్‌టన్ యూనివర్సిటీ పరిశోధకులు.
పాప్‌కార్న్‌కు మూలమైన ఎండు మొక్కజొన్న గింజల్లో పాలిఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని, పండ్లు, కూరగాయలతో సమానమైన ఈ యాంటి ఆక్సిడెంట్లు జలుబుకు కారణమైన బ్యాక్టీరియాను తరిమివేస్తాయని వారు అంటున్నారు.