రక్తహీనత తగ్గాలంటే..!

భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. దేహంలో తగినంత ఐరన్‌పాళ్లు లేకపోవడం, విటమిన్ డెఫిషియెన్సీ దీనికి కారణం. కొన్ని రకాల వ్యాధులు కూడా రక్తహీనతకు దారి తీస్తుంటాయి. ఐరన్, విటమిన్ లోపాలతో వచ్చే ఎనీమియా నుంచి ఈ ఆహారంతో బయటపడవచ్చు.


టీనేజ్ అమ్మాయిలు, మెనోపాజ్ దశకు చేరిన మహిళలు తరచుగా మెంతి ఆకు లేదా మెంతులు తీసుకోవాలి.
ఐరన్ లోపంతో వచ్చే ఒంటినొప్పులను లెట్యూస్ తగ్గిస్తుంది. 
పాలకూర రక్తహీనతను, రక్తనాళాల్లో అడ్డంకిని తొలగిస్తుంది. 
సోయాబీన్ దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది.
మూడునెలలపాటు రోజుకు పదిగ్రాముల బాదం తింటే రక్తహీనత తగ్గి దేహం శక్తిని పుంజుకుంటుంది.
నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. 
తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్ ఉంటాయి. నీరసంగా అనిపిస్తే గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగవచ్చు. అయితే డయాబెటిస్ ఉంటే మాత్రం తేనె తీసుకోకూడదు. 
అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టొమాటోలు తీసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top