ఈ సీజన్‌లో ఆహారమిలా...

ఈ సీజన్‌లో కెఫిన్, ఆల్కహాల్, నికోటిన్‌లు కీళ్ల నొప్పులను మరింత పెంచుతాయి. అందుకే కాఫీ, ఆల్కహాల్, పొగాకు వినియోగాన్ని బాగా తగ్గించండి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహారమైన చేపలతో పాటు నట్స్ ఎక్కువగా తీసుకోండి. విటమిన్ సి కూడా కీళ్లనొప్పులను నివారిస్తుంది. ఇందులోని ఔషధగుణం ఎముకల్లోని కార్టిలేజ్ కోల్పోయే గుణాన్ని తగ్గిస్తుంది. తాజా నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి ఎక్కువ కాబట్టి వాటిని విరివిగా తీసుకోండి. విటమిన్-డి ఎముకల ఆరోగ్య నిర్వహణకు మెరుగ్గా ఉపయోగపడుతుంది.

పైగా పిల్లల ఆహారంలో విటమిన్-డి లోపం వల్ల ఆస్టియోమలేసియా (రికెట్స్), ఎముక సాంద్రత తగ్గడం వంటి రుగ్మతలకు దారితీస్తుంది. అందుకే చేపలు, కాడ్‌లివర్ ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి. అప్పటికే విటమిన్-డి లోపాల కారణంగా వచ్చే వ్యాధులతో బాధపడేవారు తప్పనసరిగా డాక్టర్ సలహా మేరకు ఆ సప్లిమెంట్లు వాడాలి. విటమిన్-కె ఎక్కువగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు... ముఖ్యంగా పాలకూర ఎక్కువగా తినాలి. ఒమెగా 6-ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే కార్న్ ఆయిల్ లాంటి వాటిని ఈ సీజన్‌లో వాడకూడదు. ఎందుకంటే ఇది ఇన్‌ఫ్లమేషన్‌ను మరింతగా ప్రేరేపిస్తుంది కాబట్టి ఈ సీజన్‌లో కార్న్-ఆయిల్ వాడకపోవడం మంచిది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top