ఆరెంజ్‌ తొక్కతో చర్మం ప్రకాశవంతం

సౌందర్యానికి పండ్లు కూడా అద్భుతంగా ఉపయోగపడుతాయన్న సంగతి మనకు తెలిసిందే. పండ్లలో ముఖ్యంగా ఆరోగ్యానికి అందానికి బాగా ఉపయోగపడేది ఆరెంజ్‌. ఆరెంజ్‌ తొక్క ముఖం, చర్మఛాయను పెంచడంలో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది. ఆయిల్‌ చర్మాన్ని, చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలను తొలగిస్తుంది, మొటిమలను నివారిస్తుంది. ఇంకా స్కిన్‌ టోన్‌ కూడా మీ ముఖం మెరిసేలా చేస్తుంది. 

ఆరెంజ్‌ తొక్కను నిల్వ చేయడంతో పాటు ఉపయోగించడం కూడా చాలా సులభం. అందుకు మీరు చేయాల్సిందల్లా, మీరు తిన్న ప్రతిసారి ఆరెంజ్‌ తొక్కను పడేయకుండా సేవ్‌ చేయాలి. తర్వాత కొంత పెద్ద మెత్తం అయిన తర్వాత తొక్కను రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అంతే ఫేస్‌కు ఉపయోగించడానికి ఆరెంజ్‌ పౌడర్‌ రెడీ. ఈ పౌడర్‌ను దీర్ఘకాలం ఉపయోగించడానికి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ ఆరెంజ్‌ పౌడర్‌తో ఫేస్‌ ఫ్యాక్‌ వేసుకోవడం వల్ల ముఖంలో మంచి ఛాయతో పాటు, కళంకంలేని క్లియర్‌ స్కిన్‌ ను మీకు అందిస్తుంది. మరి ఈ సులభమైన ఫేస్‌ ప్యాక్‌ తో మీ అందాన్ని మెరుగుపరచుకోవడానికి తప్పనిసరిగా ఆరెంజ్‌ తొక్కలను ఉపయోగించండి. ఆరెంజ్‌ పౌడర్‌తో ఫేస్‌ ప్యాక్‌ ఎలా ఉపయోగించాలో చూద్దాం.. 

ఆరెంజ్‌ తొక్క పెరుగు: ముందుగా ఆరెంజ్‌ తొక్కను శుభ్రం చేయాలి. ఆరెంజ్‌ తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి మిక్సీలో వేసి, దానికి ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు కలిపి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. తర్వాత ముఖంలో దుమ్ము, ధూళి తొలగించడానికి ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్‌ సేసుకొన్న ఆరెంజ్‌ పీల్‌ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట పాటు అలాగే వదలి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఆరెంజ్‌ పీల్‌ ఫేస్‌ ప్యాక్‌ డెడ్స్‌ స్కిన్‌ సెల్స్‌ ను తొలగించడంతో పాటు ముఖం మీద మురికిని కూడా తొలగిస్తుంది. దాంతో ముఖం తాజాగా మెరుస్తుంటుంది. ఆరెంజ్‌ పీల్‌ నిమ్మ: ఆరెంజ్‌ తొక్కను శుభ్రం చేసి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె ఒక టేబుల్‌ స్పూన్‌ లెమన్‌ జ్యూస్‌ తో మిక్స్‌ చేసి, మరొక్కసారి బాగా బ్లెడ్‌ చేయాలి. ఈ పేస్ట్‌ ను ముఖానికి ప్యాక్‌ లా వేసుకోవాలి. 

అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ వల్ల చర్మం త్వరగా శుభ్రపడుతుంది. సున్నితంగా మారుతుంది. ఆరెంజ్‌ ఫీల్‌ పసుపు: ఆరెంజ్‌ తొక్కను చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి, పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా వేసి మరోసారి బ్లెండ్‌ చేయాలి. ఈ రెండింటి మిశ్రమానికి కొద్దిగా పసుపు చేర్చి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ప్యాక్‌ వేసుకొనే ముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్‌ తొక్కతో ప్యాక్‌ వేసుకోవడం వల్ల ముఖ చర్మం ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. ఆరెంజ్‌ పీల్‌ సాండిల్‌ ఉడ్‌: ఎండిన ఆరెంజ్‌ తొక్కను మిక్సీలో వేసి అందులో కొద్దిగా రోజ్‌ వాటర్‌ సాండిల్‌ ఉడ్‌ పౌడర్‌ రెండూ మిక్స్‌ చేసి మెత్తగా పేస్ట్‌ లా తయారు చేసుకోవాలి. 

తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొన్న తర్వాత ఈ ప్యాక్‌ను ముఖానికి మెడకు అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ వేసుకొన్న అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఆరెంజ్‌ పీల్‌ ఫేస్‌ ప్యాక్‌ వల్ల ముఖ్యం సున్నితంగా, ప్రకాశవంతమైన ఛాయతో ఉంటుంది. మొటిమలు మచ్చలు తొలగించి క్లియర్‌ స్కిన్‌ ను అంధిస్తుంది. ఆరెంజ్‌ తొక్కను ప్యాక్‌ లా ఉపయోగించి సున్నితమైన చర్మం, ప్రకాశవంతమైన ఛాయ పొందడానికి ఈ కొన్ని పద్దతులను మీరు కూడా ఫాలో అవ్వండి.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top