మీరు స్టైల్ గా ఉండాలంటే కొన్ని టిప్స్

లావుగా ఉన్నవారు టఫ్ ఫ్యాబ్రిక్, చిన్న ఫాలింగ్ మెటీరియల్ ఎంచుకుంటే బాగుంటుంది. 

ఎత్తుగా, కండలు తిరిగిన శరీరంతో ఉన్నవారు లైట్ ఫ్యాబ్రిక్‌ను వాడచ్చు.

మంచి ఎత్తు ఉండి, అబ్డామినల్(పొత్తికడుపు) ఫ్లాట్‌గా ఉంటే ఏ డ్రెస్ వేసినా బాగుంటుంది. అందుకే వెయిస్ట్ లైన్ క్లియర్‌గా ఫ్యాట్ లేకుండా చూసుకోవాలి. డ్రెస్ డిజైన్ చేసేటప్పుడు డిజైనర్స్ వెయిస్ట్‌లైన్‌ను ప్రధానంగా చూస్తారు.

సన్నగా, బక్కపలచగా ఉన్నవారు బిగుతైన దుస్తులను ఎప్పుడూ ట్రై చేయకూడదు. వీరు ఫాలింగ్ మెటీరియల్‌ను ఎంచుకోవాలి. చెక్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు.

ఫెయిర్‌గా ఉన్నవారు ఎంత బ్రైట్ కలర్స్ అయినా ధరించవచ్చు.

బాడీ హెవీగా, బల్కీగా ఉంటే ఔట్‌పుట్ సరిగ్గా రాదు. 

పొట్టిగా ఉన్నవారు నిలువు గీతలు గల చొక్కాలను వేసుకోవచ్చు. వీరికి అడ్డ గీతల డ్రెస్సులు బాగుండవు. అలాగే పొడవుగా ఉన్నవారు అడ్డ గీతల షర్ట్‌లను ధరించవచ్చు.

ఇది వర్షాకాలం. ఈ సీజన్‌కి తగ్గట్టు బ్రైట్‌కలర్స్ బాగుంటాయి. ఈవెనింగ్ మూడ్‌ను, డే మూడ్‌ను బ్రైట్ కలర్స్ బాగా ఎలివేట్ చేస్తాయి. 

ఏ డ్రెస్ వేసుకున్నా ప్రధానంగా ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ డ్రెస్‌కు, ఆ డ్రెస్ వల్ల ధరించినవారూ అందంగా కనిపిస్తారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top